లక్ష టన్నుల కందిపప్పు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం రాష్ట్రంలో కందిపప్పు కిలో రూ.150కే అందిస్తున్నాం • నవంబర్ నాటికి సమస్య పరిష్కారమవుతుంది.
• విభజన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.
•
•
రేషన్ డోర్ డెలివరీపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
రాష్ట్రానికి న్యాయం చేయాలన్న భావన కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో ఉంది.
06.06.2024
• ప్రతిపక్ష హోదా, భద్రత గురించి కాకుండా జగన్ ప్రజల గురించి ఆలోచించాలి.
• వైసీపీ… తాడు బొంగరం లేని పార్టీ
ఢిల్లీ మీడియా సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి
శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
ఆంధ్రప్రదేశ్కు లక్ష టన్నుల కంది పప్పు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత వేధిస్తున్నా ఏపీలో కిలో కంది పప్పు రూ.150 అందిస్తున్నామన్నారు. నవంబర్ నాటికి కందిపప్పు సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. గిడ్డంగుల నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో సింహభాగం ఇవ్వాలని కోరామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర మార్కెటింగ్ శాఖలు నిర్వహించే ప్రైస్ మానిటరింగ్ సెంటర్లను ప్రస్తుతం ఉన్న 5 నుంచి 13కు పెంచాలని కోరామన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 60 లక్షల దీపం కనెక్షన్లను పీఎమ్ యూ పై పథకం కింద వచ్చే విధంగా మార్పిడి చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్రమంత్రులు శ్రీ ప్రహ్లాద్ జోషి, శ్రీ హర్దీప్ సింగ్ పూరిలతో భేటీ అయ్యారు. అనంతరం ఆంధ్ర భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “విభజన వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఎన్ఎఫ్ఎస్ఏ ప్రకారం రాష్ట్రానికి అన్యాయం జరిగింది. విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా.. 2001 సెన్సెస్ ప్రకారం కేటాయించారు. దీంతో ఏపీకి రేషన్ కార్డులు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు ఆటంకం లేకుండా ప్రతి నెలా రేషన్ సరఫరా చేస్తున్నాం.
Full Project
XML file
Song