శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీలు
తలెత్తుకుని పాలన సాగిస్తాయి
• గ్రామ స్వరాజ్యం గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆచరణీయం
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇవ్వడంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మేటి నాయకుడిగా నిలిచారు
• ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చిన సర్పంచుల సంఘాల ప్రతినిధులు పంచాయతీలు బతకాలి.. సర్పంచులకు గౌరవం పెరగాలి అని ఆలోచించే ఏకైక నాయకుడు గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ నేతలు అన్నారు. పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఆయన కృషి చేస్తున్నారన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకోవడం, వరద ముంపుకు గురైన 400 పంచాయతీలకు రూ. 4 కోట్ల సొంత నిధులు విరాళం ఇవవడం అందుకు నిదర్శనమన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులుగా తాము ఒక నెల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించినట్టు తెలిపారు. మంగళవారం, మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి గారి నివాసంలో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ల ప్రతినిధులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. వరద బాధితుల సహాయార్ధం తమ సర్పంచులు, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీల ఒక నెల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. ఈ మేరకు అంగీకార పత్రాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు. అనంతరం సర్పంచులు మాట్లాడుతూ..
• శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గ్రామాలు అభివృద్ధి చేస్తాం : శ్రీ చిలకలపూడి పాపారావు, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులు
దేశ చరిత్రలో పంచాయతీల అభివృద్ధికి సొంత నిధులు వెచ్చించిన నాయకుడు లేడు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు విరాళం అందించిన 400 పంచాయతీల్లో 90 శాతం వైసీపీ సర్పంచులే ఉన్నా.. రాజకీయాలకతీతంగా ఉప ముఖ్యమంత్రి గారు చేసిన సాయం గత పాలకులకు కనువిప్పు కావాలి. సర్పంచులు గౌరవంగా తలెత్తుకు తిరిగే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్
Photo project
FONT LINK
XML LINK
ALL PHOTOS LINK
BACKGROUND REMOVE