ఒక అడుగు.. ఒక నడక.. ఒక మార్పు
వైవిధ్యభరితమైన భారతదేశ విశిష్ట తాత్వికతను బలోపేతం చేస్తూ.. మత సామరస్యాన్ని పాదుకొల్పుతూ ఆది గురువు ఆదిశంకరాచార్యులవారు కేరళ నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణించారు.
స్వాతంత్ర్య పోరాటంలో లక్షలాది మందిని ఏకం చేసి స్వాతంత్రం కోసం ఉద్వేగాన్ని రగిలించి.. పోరాడేందుకు మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేస్తూ నడక సాగించారు. అలాగే.. పేదల అభ్యున్నతి కోసం తమ భూములను స్వచ్ఛందంగా వదులుకునేలా.. ఎక్కడా రక్తం చిందించకుండా భూస్వాములను ప్రేరేపించేందుకు ఆచార్య వినోబా భావే దేశాన్ని చుట్టారు.
చాలామంది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచినప్పటికీ… ఉన్నత లక్ష్యం లేని నడక ప్రజలకు స్ఫూర్తిని కలిగించదు.. దేశానికి సేవ చేసినట్టుకూడా కాదు.. అది కేవలం షికారు మాత్రమే అవుతుంది.
భారతదేశం యొక్క అసమానమైన వైవిధ్యం, చైతన్యాన్ని వాస్తవికంగా గ్రహించాలంటే, మనిషి దానిలోని ఆత్మతో నిమగ్నమవ్వగలగాలి. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నడకలు, యాత్రలాంటివి లేకుండానే.. ఈ సారాంశాన్ని అర్థం చేసుకొన్నారు. అచంచలమైన దృఢ నిశ్చయంతో వ్యవహరిస్తున్నారు. ఆయన సాహసోపేతమైనటువంటి, పరివర్తనాత్మక నిర్ణయాలు భారతదేశం యొక్క శక్తివంతమైన, స్థిరమైన స్థానాన్ని ప్రపంచ వేదికపై పటిష్టం చేశాయి.
అవిశ్రాంతంగా ఐక్యతకు కృషి చేస్తూనే.. జాతి గౌరవాన్ని ఇనుమడింప చేస్తూ.. అందరి నడుమ అవినాభావ సంబంధాలను ఏర్పరచినందుకు, నిజమైన కర్మయోగి.. గౌరవ ప్రధాని శ్రీ మోదీజీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమిళనాడులోని సనాతన ధర్మానికి పవిత్ర చిహ్నమైన సెంగోల్‌ను ఢిల్లీలోని పార్లమెంట్‌లో ప్రతిష్టించడం మన ఐక్యత, సంప్రదాయం పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనం.
Full Project
XML file
Video link
Font link
After effect project file