మా ఇళ్లు మధ్య ఉన్న మద్యం షాపు వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామవాసులు జనసేన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. గత రెండేళ్లుగా ప్రభుత్వాధికారులకు అర్జీలు పెడుతున్నా, నిరసనలు తెలుపుతున్నా సమస్య పరిష్కరించడం లేదని వాపోయారు. ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఉండటం వల్ల మహిళలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని… మద్యం షాపును ఇళ్లకు కాస్త దూరంగా ఏర్పాటు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
కనీస వేతనాలు కరవై, కుటుంబ పోషణ భారమై ఆర్థికంగా చితికిపోతున్నామని ది అల్లూరి సీతారామరాజు ఆశ్రం మెడికల్ కాలేజి అండ్ హాస్పటల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. 13 ఏళ్లుగా జీవో నెంబర్ 68 ప్రకారమే యాజమాన్యాలు జీతాలు చెల్లిస్తున్నారని, ఈ అధిక ధరల సమయంలో ఆ జీతాలతో జీవించడం చాలా కష్టంగా ఉందని వాపోయారు. కనీస వేతన బోర్డు నియమించాలని, లేదా జీవో 68పై 50 శాతం పెంచి జీతం ఇచ్చేలా చూడాలని కోరారు.
•
మార్కాపురం రెవెన్యూ పరిధిలోని నాలుగున్నర ఎకరాల నా భూమిని ముగ్గురు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వారికి రెవెన్యూ అధికారులు సహకరించారని మార్కాపురంకు చెందిన అంధుడు శ్రీ బోయపాటి వెంకట రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లు కనిపించకపోయినా గత పదేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ పోరాటం చేస్తున్నానని, నా సమస్య నేటికి పరిష్కారం కాలేదని వాపోయాడు. నా భూమి నాకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వీటితోపాటు వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు జనసేన గ్రీవెన్స్ కు తరలివచ్చారు. వైద్యానికి ఆర్ధిక సాయం చేయాలని కొందరు బాధితులు విజ్ఞప్తి చేశారు. చీటింగ్ కేసులు, భూ వివాదాలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అపరిష్కతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కారం చూపాలని కోరుతూ మరికొందరు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శ్రీ షేక్ రియాజ్, జనసేన నాయకులు శ్రీమతి పార్వతి నాయుడు, శ్రీ ఆలా నారాయణ, లీగల్ టీమ్ సభ్యులు శ్రీ వెలివెల వీరరాఘవయ్య పాల్గొన్నారు.
Full project
XML file
Song