మాజీ మంత్రి కాసు మహేష్ రెడ్డి అనుచరులు 4 అంతస్తుల తమ బిల్డింగ్ ఆక్రమించుకున్నారని, కోర్టు ఆదేశాలని సైతం పట్టించుకోవడం లేదని, నాటి పోలీసు ఉన్నతాధికారులు శ్రీ విశాల్ గున్నీ, శ్రీ రవిశంకర్ రెడ్డిలు వైసీపీ వారికి అనుకూలంగా పని చేశారని పల్నాడు జిల్లా, గురజాల మండలానికి చెందిన శ్రీ అరిగెల అరుణ్ అనే బాధితుడు వినతి పత్రం సమర్పించారు. తన అక్క పేరిట ఉన్న బిల్డింగ్ కబ్జా చేసిన కాసు మహేష్ రెడ్డి అనుచరులు శర్మల శివ, శ్రీనులు పార్టీ కార్యాలయం పెట్టడంతో ఇంటి అద్దెలు, షాపుల అద్దెలు కూడా వాళ్లే వసూలు చేసుకున్నారని తెలిపారు. ఆ బాధతో తన సోదరి మరణించిందని తెలిపారు. కోర్టు ఆదేశానుసారం తమ ఇళ్లు తనకు ఇప్పించడంతోపాటు ఆక్రమించిన వైసీపీ నాయకులు, వారికి సహకరించిన పోలీసు అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని సంక్రాంతిపల్లెలో ఉన్న పీర్లగుడి ధర్మరాజులు దేవాలయానికి చెందిన 18 ఎకరాల భూమిపై అక్రమార్కుల కన్ను పడిందని, పి. గోవిందయ్య అనే వ్యక్తి కుటుంబం ఆ భూములు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తోందని, వారి నుంచి పీర్ల గుడి భూములకు శాశ్వత రక్షణ కల్పించాలని కోరుతూ ఆ గ్రామ ప్రజలు వినతిపత్రం ఇచ్చారు.
విజయవాడ శివారు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో నాలుగేళ్లుగా తాగునీటి సమస్య ఉందని, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదని ఆ ప్రాంతానికి చెందిన మహిళలు అర్జీ సమర్పించారు. భూ సమస్యలు, అనారోగ్య సమస్యలు, పింఛన్ల మంజూరు, రహదారులకు భూములు ఇచ్చి పరిహారం అందక ఇబ్బందులు పడుతున్న రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజలు సమస్యలు చెప్పుకొనేందుకు జనవాణికి వచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీ దాసరి కిరణ్, శ్రీమతి కిరణ్ ప్రసాద్, న్యాయ విభాగానికి చెందిన శ్రీ చదలవాడ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్ల
Full project
XML file
Song link
Font link