వైసీపీ కార్పొరేటర్ నా భూమి కబ్జా చేశారు
• విజయవాడ దుర్గా అగ్రహారానికి చెందిన బాధితుడి ఆవేదన పదేళ్లుగా ఉన్న వృద్ధాప్య పింఛన్ వైసీపీ సర్కారు తొలగించింది. • సోమవారం అర్జీలు స్వీకరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ
శాసనసభ్యులు శ్రీ చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు
‘వైసీపీ కార్పోరేటర్ భూమిని కబ్జా చేశాడు.. పోలీసులు కొమ్ము కాశారు.. న్యాయం చేయండి’ ఓ బాధితుడి ఆవేదన.. మా భూమిని కౌలుకు తీసుకున్నారు.. కౌలు చెల్లించకపోగా, భూమిలోకి అడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు.. గ్రామ స్థాయి వైసీపీ నాయకుడి దాష్టీకంతో భూమికి దూరమయ్యాం.. ఓ రైతు బాధ.
వైసీపీ హయాంలో పదేళ్లుగా వస్తున్న వృద్ధాప్య పింఛన్ పోయిందని ఆందోళన. – ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణికి తరలివచ్చారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు సాగించిన అరాచకాలతోపాటు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు సమర్పించారు. సోమవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణిలో విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు.
నా
‘విజయవాడ, దుర్గ అగ్రహారం సర్వే నంబర్ 78/1బి నాకు భూమి ఉంది. గతంలో తహసీల్దార్ సర్వే నిర్వహించి భూమికి హద్దులు నిర్ణయించి నాకు అప్పగించారు. ఆ భూమిని 30వ డివిజన్ వైసీపీ కార్పోరేటర్ జానారెడ్డి కబ్జా చేశాడు. ఎలాంటి పత్రాలు లేకున్నా అక్రమంగా భూమిని అక్రమించి భూమిలోకి రావద్దు అంటూ బెదిరిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా సదరు కార్పొరేటర్ కి కొమ్ము కాస్తున్నారు. ఆక్రమణకు గురైన నా భూమిని నాకు ఇప్పించి న్యాయం చేయండి’ అంటూ విజయవాడకు చెందిన శ్రీ నమ్మి వెంకట సూర్యప్రకాశరావు అనే వ్యక్తి జనవాణిని ఆశ్రయించారు.
* ‘ప్రకాశం జిల్లా, చిన్న గంజాం మండల పరిధిలోని మోటపల్లిలో నాకు 2 ఎకరాల 35 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిలో గత కొంతకాలంగా సుబాబుల్ సాగు చేసుకుంటున్నాను. సదరు భూమికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలతో పాటు అన్ని పత్రాలు నా వద్ద ఉన్నాయి. మొన్నటి వరకు ఆన్ లైన్ లోనూ నా పేరు మీదే ఉంది. అకస్మాత్తుగా ఇప్పుడు
Full project
XML file
Song link