జనసేన
JANASENA
వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే ప్రతి
భక్తునికి అవకాశం ఉంటుంది
• భక్తుల పరిరక్షణ ప్రథమ కర్తవ్యంగా టీటీడీ భావించాలి
• తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం
08.01.2025
• గాయపడిన ప్రతీ క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది.
• తిరుపతిలో జన సైనికులు, వీర మహిళలు తోడ్పాటు అందించాలి
వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తునికి అవకాశం ఉంటుంది. భక్తుల పరిరక్షణ ప్రథమ కర్తవ్యంగా భావించాలని, గాయపడిన ప్రతీ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని టీటీడీ అధికారులను, పాలక మండలినీ కోరుతున్నాను. తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం. తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల వద్ద, క్యూ లైన్ల దగ్గర అధికారులకు, పోలీసు సిబ్బందికి జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను. జనవరి 10 నుండి 19 వరకూ స్వామి వారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. దర్శనం టికెట్ కోసం తిరుపతి నగరంలో 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 7 లక్షల మందికి పైగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు. కావున ప్రతీ భక్తుడు సంయమనం పాటించాలని కోరుతున్నాను.
( కె. నాగబాబు ) జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్
Full project
Download
XML file
Download
Song link
Font link