జనవరి 5వ తేదీ నాటికి ఖరీఫ్ సీజన్లో 4,15,066 మంది రైతుల నుంచి 27,00,00 MT ధాన్యం సేకరణ చేశాము. బాధ్యతలు విస్మరించిన గత పాలకులు నాటి ఖరీఫ్ లో 2,12,431 మంది నుంచే ధాన్యం తీసుకొంది. మా ప్రభుత్వం ధాన్యం సేకరణ చేయడమే కాదు 24 గం.లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తున్నాము. రూ.6,083.69 కోట్లు చెల్లింపులు చేశాము. వైసీపీ వాళ్లు రైతులకి ధాన్యం డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వలేదనే వాస్తవాన్ని గణాంకాలే చెబుతున్నాయి.
గౌ.ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, గౌ.ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు రైతాంగం మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారు. రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం.
తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించింది
•మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచిస్తున్నాను.
మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచిస్తున్నాను. అదే విధంగా మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్ళి పరామర్శించి మనో ధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలి.
Full project
XML file
Song link
Font link