గత ప్రభుత్వానిది స్కాముల్లో రికార్డు… కూటమి ప్రభుత్వానిది స్కీమల్లో రికార్డు
• పాడి రైతులు న్యూజిలాండ్ తరహాలో ప్రగతి సాధించాలి
• గత ప్రభుత్వంలో నాయకుల సొంత డెయిరీలను పెంచుకున్నారు
• తిరుపతి దుర్ఘటన విషయంలో టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో, పాలక మండలి సభ్యులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి క్షమాపణ చెప్పాలి
• నేను ప్రజల్ని ఓట్లు అడిగాను కాబట్టే.. తప్పు జరిగినపుడు బాధ్యతగా క్షమాపణ కోరాను
• అధికారులకు హనీమూన్ పీరియడ్ అయిపోయింది
• సొంత ఇష్టాలను పక్కన పెట్టి రాజ్యాంగబద్ధంగా ప్రజల కోసం పనిచేయండి
• పిఠాపురం నుంచే జిల్లాల పర్యటన ప్రారంభిస్తాను
• పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా గోకులాలను ప్రారంభించి పిఠాపురం బహిరంగసభలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘గత ప్రభుత్వం పాడి రైతును పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో ఎవరూ బాగుపడకూడదు.. ఎవరి దగ్గరా డబ్బులుండకూడదు అనే ఒకే ఒక సిద్ధాంతంతో లక్షలాది పాడిరైతుల పొట్టకొట్టే చర్యలు ఆనాటి పాలకులు చేపట్టారు. సహకార డెయిరీలను గాలికొదిలేసి, సొంత డెయిరీలను అభివృద్ధి చేసుకోవడంపైన దృష్టి పెట్టార’ ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పాడి రైతులకు ఎంతో అవసరం అయ్యే గోకులాలను గత అయిదేళ్ల పాలనలో కేవలం 268 నిర్మిస్తే, కూటమి ప్రభుత్వం కేవలం 6 నెలల్లోనే 12,500 నిర్మించి పాడి రైతులకు అండగా నిలిచిందని, ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజకీయం అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరడం, ముద్దులు పెట్టడం కాదు… కష్టంలో ఉన్నవారికి అండగా నిలబడటడం, వారికి వృద్ధిలో తోడ్పాటునందించడమే నిజమైన రాజకీయం అన్నారు. పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాలను ఒకే రోజు ప్రారంభించే కార్యక్రమాన్ని శుక్రవారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురం పాతబస్టాండు వద్ద ఉన్న మున్సిపల్ పాఠశాలలో జరిగిన సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… ‘‘నాకు స్వచ్ఛంగా రాజకీయాలు చేయడమే తెలుసు. మండల పరిషత్ అధికారి మీద దాడి జరిగితే ఆయనది ఏ కులం.. ఏ ప్రాంతం అని చూడకుండానే పరామర్శకు వెళ్లాను. ఓ ప్రభుత్వ అధికారి కొడుకుగా ఈ రాష్ట్ర ప్రజలు పన్నులు కట్టిన జీతం సొమ్మును తిని పెరిగిన వ్యక్తిగా ఏ ప్రభుత్వ అధికారిపై, సిబ్బందిపై దాడి జరిగినా ఇలాగే స్పందించేవాడిని. ప్రభుత్వ అధికారుల మీద దాడి జరిగితే మా నాన్న మీద జరిగిన దాడిగానే దాన్ని భావిస్తాను.
అరాచక పాలన నుంచి విముక్తి అయిన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తి నిబద్ధతతో పని చేయాలనే తలంపుతోనే ముందుకు వెళ్తున్నాం. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా సరైన రోడ్లు లేక, డోలీల్లో వైద్యసేవలకు తీసుకెళ్తూ నరకయాతన పడుతున్న గిరిజనుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకే కొండల్లో తిరిగాను. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అని తెలిసినా, హెచ్చరికలు ఉన్నా తెగించి కొండల్లో నడవడం వెనుక అక్కడి ప్రజల బాధలను స్వయంగా తెలుసుకోవాలన్న తపన, వేదన నాలో ఉన్నాయి. కాబట్టే మారుమూల కుగ్రామాలకు సైతం వెళ్తున్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో గిరిజన గ్రామాలకు రోడ్లు వేసేందుకు అప్పటికప్పుడు రూ.39 కోట్లు ముఖ్యమంత్రి పెద్ద హృదయంతో అందించడం సంతోషకరం. రూ.500 కోట్లు వెచ్చించి ప్యాలెస్ లు కట్టుకున్న వారికి, రూ.2 కోట్లతో బాత్ రూంలు నిర్మించుకున్న వారికి, గిరిజనులు కష్టాలేం తెలుస్తాయి..?
• న్యూజిలాండ్ తరహాలో పాడి రైతులు ఎదగాలి
వైసీపీ పాలనలో సొంత డెయిరీలను, కొన్ని ప్రత్యేక డెయిరీలను ప్రోత్సహించారు. కనీసం పాడిరైతును పట్టించుకున్న దాఖలాలు లేవు. గోకులాలు నిర్మిస్తే పశువులు పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటే పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని తెలిసినా వైసీపీ నాయకులకు అవేవీ పట్టలేదు. ఇప్పుడు నిర్మించిన గోకులాలతో చిన్నస్థాయి పాడి రైతులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఆదాయం పెరుగుతుంది.
Photo project
Font link
Download
Download
Background photo
Download
Remove app
Download