పండగ సందడితో తెలుగు రాష్ట్రాల పల్లెలు శోభాయమానం
భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్యరాసులను లోగిళ్లకు మోసుకువచ్చే ఈ సంక్రాంతి పండుగ వేళ భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. గంగిరెద్దులు.. హరిదాసులు.. భోగిమంటలు.. పిండివంటల సమ్మేళనమే సరదాల సక్రాంతి. అటువంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెలవైపు పరుగులు తీశాయి. ఇది ప్రజలకు ఈ పండుగపై ఉన్న మక్కువను తెలియచేస్తుంది. ఉపాధికోసం పల్లె బిడ్డలు నగరాలకు వలసపోవడంతో గ్రామాలు జనాలు లేక కొంతవరకు పలుచబడ్డాయి.. ఈ సంక్రాంతి పండుగ వేళ పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉంది.. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా శోభిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో విరాజిల్లాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
( పవన్ కళ్యాణ్ ) ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
Full project
XML file
SONG link