జనసైనికుడికి అండగా నిలబడ్డ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు*
శ్రీకాళహస్తి జనసైనికుడు ,కిడ్నీ పేషంట్ దేవలం జగదీష్ కి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ 12 లక్షలు విడుదల
శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట పట్టణం కి చెందిన జనసైనికుడు శ్రీ. దేవలం జగదీష్ గత 5 సం.|| గా రెండు కిడ్నీలు పాడైపోవడం వల్ల డయాలసిస్ చేసుకుంటూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ చికిత్స కొరకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ కష్టం గా ఉందని నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారి దృష్టికి తెలపడంతో , ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వినుత గారు తీసుకుని వెళ్లి జగదీష్ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్లి 12,00,000 ( 12 లక్షలు ) సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేశారు.
మంజూరు చేసిన 12 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారి చేతులు మీదుగా జనసైనికుడు దేవలం జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా వినుత కోటా గారు మాట్లాడుతూ జనసైనికులకి కష్టం వస్తే పవన్ కళ్యాణ్ గారు తన సొంత కుటుంబ సభ్యులకు కష్టం వచ్చినట్టు ఎప్పుడూ ఆదుకుంటారని ,శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసైనికుడికి కూడా తన అభ్యర్థనను స్వీకరించి 12 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించినందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు , ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ లో ఉండటం జనసైనికులు అందరూ అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలిపారు.
చెక్ ను అందుకున్న దేవలం జగదీష్ మరియు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు, పదాభివందనాలు తెలిపారు. అనారోగ్యంతో మరియు ఆర్థిక ఇబ్బందుల తో చికిత్స కొరకు, కుటుంబ పోషణ కి చాలా ఇబ్బంది పడుతున్న తమకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 12 లక్షలు రూపాయలు అందించినందుకు జీవితాంతం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కుటుంబ సభ్యులు అందరూ రుణపడి ఉంటామని తెలిపారు మరియు ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
//
ఇట్లు
జనసేన పార్టీ కార్యాలయం
శ్రీకాళహస్తి నియోజకవర్గం
Full project
XML file
FONT link