విద్యుత్ షాక్‌తో ఆగిన ఆరేళ్ల బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన డాక్డర్
విజయవాడ – అయ్యప్పనగర్‌లో సాయి(6) అనే బాలుడు రోడ్డు మీద విద్యుత్ షాక్ తగిలి గుండె ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.
అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి చూసి బాలుడికి సీపీఆర్ చేసి బాలుడి ప్రాణాలు కాపాడింది.
దారుణం.. ఆస్తి కోసం 2 రోజులుగా కన్న తల్లి అంతక్రియలు చెయ్యని కొడుకు, కూతుర్లు.
సూర్యాపేటలో లక్ష్మమ్మ(80) అనారోగ్యంతో చనిపోగా ఆమె పేరు మీద ఉన్న 21 లక్షల ఆస్తి, 20 తులాల బంగారం కోసం కక్కుర్తి.
ఈ పంచాయితీ తెగకపోవడంతో లక్ష్మమ్మ మృతదేహాన్ని రెండు రోజులుగా ఫ్రీజర్‌లో పెట్టారు.. దీంతో గ్రామస్తులు కొడుకు, కుతుర్లపై మండిపడ్డారు.
కోవిడ్ టీకా తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్!
కొవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నటు నిర్ధారించిన శాస్త్రవేత్తలు.
కొవాగ్జిన్ టీకాపై బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయన ఫలితాలను ‘స్ప్రింగర్ లింగ్’ జర్నల్‌లో ప్రచురించారు. అధ్యయనంలో భాగంగా కొవాగ్జిన్ టీకా తీసుకున్న 926 మందిపై అధ్యయనం నిర్వహించారు.
ఏడాది పాటు సాగిన ఈ అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
యవ్వనంలో ఉన్న వారిలో 48 శాతం మంది, పెద్దల్లో 43 శాతం మంది శ్వాసకోశ సమస్యకు గురైనట్టు తేలింది.
టీకా తీసుకున్న ఏడాదిలోపు ఎడ్వెర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంటెరెస్ట్ (ఏఈఎస్ఐ) ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఏఈఎస్ఐ వచ్చిన వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం వంటివి జరుగుతాయి.. కొన్ని కేసుల్లో స్ట్రోక్ వంటి సమస్యలు కూడా వస్తాయని నిర్ధారించిన శాస్త్రవేత్తలు.
రుణ మాఫీ కోసం రూ. 35 వేల కోట్లు సమీకరణ ఎలా!
ప్రభుత్వ భూముల అమ్మకానికి రంగం సిద్ధం..
రుణ మాఫీకి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి ప్రతినెలా బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించాలని ఆలోచన.. కానీ ఈ ప్రతిపాదనకు ఆర్బీఐ అంగీకరించడానికి ఒప్పుకోదని తెలిపిన అధికారులు.
భూముల అమ్మకం ద్వారా రుణ మాఫీ చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్.
ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టి.. దాడి చేసిన పోలీసులు..
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, సీసీటీవీని పగులగొట్టి పెద్దారెడ్డి వర్గీయులపై విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపిస్తున్న పెద్దారెడ్డి అనుచరులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సీసీ ఫుటేజ్.
FULL PROJECT LINK
XML FILE
SONG LINK