అరణ్య సూక్తం చదివితే మొక్కలు, చెట్ల విశిష్టత తెలుస్తుంది. చెట్లు నుంచి మనం ప్రతి రోజూ ఎంత ప్రయోజనం పొందుతున్నామో అర్ధం అవుతుంది. వృక్షాలకు మనం ఎంత రుణపడ్డామో తెలుస్తుంది. చెట్టును పదిమంది సంతానంతో సమానంగా చూస్తారు. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్టును ఇంటి పెద్ద కొడుకుగా భావిస్తారు. ఓ చెట్టు చేసే మేలు అంతాఇంతా కాదు. పచ్చదనంతో రాష్ట్రం సుందరంగా, శుభకరంగా ఉంటే అది ప్రజలందరికీ మంచిద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
రాష్ట్రంలో మియావకీ విధానంలో వనాల అభివృద్ధి
•తక్కువ విస్తీర్ణంలో తక్కువ ఖర్చుతో పచ్చదనం పెంపు
•మొక్కలను పెంచడం, సంరక్షించడం అలవాటుగా తీసుకోవాలి
•రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే బాధ్యతను తీసుకుందాం
•గత ప్రభుత్వ హయాంలో రూ.19 వేల కోట్ల ఎర్రచందనం, సహజ వనరలు దోపిడీ
•మేం పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం ఇస్తాం
•శుక్రవారం మంగళగిరిలో జరిగిన వనమహోత్సవంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి పాల్గొని, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారు
Font link
Full Project
XML file
Song link