నేనున్నానని..
•అతిసార బాధిత కుటుంబాల్లో భరోసా నింపిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి గుర్ల పర్యటన
•క్షేత్రస్థాయిలో చంపావతి నదీ కాలుష్య పరిస్థితి స్వయంగా పరిశీలన
•జిల్లా అధికారులతో తాగునీటి సరఫరా మెరుగుదలపై విస్తృతంగా సమీక్ష
తాగునీటి సరఫరాలో జరిగిన కొన్ని లోపాల కారణంగా అతిసారం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేనున్నాననే భరోసా నింపారు.
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ఇటీవల అతిసారం ప్రబలి పలువురు మృతి చెందారు. మరికొందరు ఆస్పత్రి పాలయ్యారు. ప్రభుత్వం తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోమవారం గుర్ల ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. అధికారులతో సమీక్ష చేసి అతిసారానికి గల కారణాలు తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడటమే కాదు… క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరా జరుగుతున్న తీరును ఆయన క్షుణ్నంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. మృతుల కుటుంబాలతో మాట్లాడి వారికి తగిన భరోసా కల్పించారు. ప్రభుత్వం పరిహారం అందించే లోగా తన సొంత డబ్బు నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం ప్రకటించి మరోసారి తన ఉదారతను చాటారు.
రుషికొండ నిర్మాణాలు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
గుర్ల పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం విమానాశ్రయానికి వస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రుషికొండపై గత ప్రభుత్వం రాజ భవంతుల తరహాలో చేసిన నిర్మాణాలను పరిశీలించారు. గత ప్రభుత్వంలో సుమారు రూ.600 కోట్లను ఖర్చు చేసి మరీ నిర్మించిన ఈ భవనాలు ఎన్నికల ముందు ఎవరూ చూడటానికి కూడా అప్పటి ప్రభుత్వం అనుమతించలేదు. ఎన్నికల ముందు విశాఖపట్నం పర్యటనలో పలుమార్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రుషికొండ ప్యాలెస్ గురించి ప్రస్తావించారు. అటుగా వస్తున్న ఉప ముఖ్యమంత్రివర్యులు ప్యాలెస్ ను ఒకసారి పరిశీలించాలని భావించి లోపలకు వెళ్లారు. 7 అతి పెద్ద భవనాలు, వీటిలోని మూడు ఇళ్లను నిర్మించిన తీరును ఎంపీ శ్రీ ఎం.భరత్ గారు ఉప ముఖ్యమంత్రివర్యులకి వివరించారు. ప్యాలెస్ పరిసరాలను, సీ వ్యూ పాయింట్ ను బయట నుంచే చూసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పని చేస్తున్న సిబ్బందితో మాట్లాడి, వారితో ఫొటోలు దిగారు. భవనాల ఎత్తు, వాటి విస్తీర్ణం,వాటి మార్కెట్ ధర వంటి విషయాలను, అలాగే న్యాయ పరమైన అంశాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యలమంచిలి ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, విశాఖ కార్పొరేటర్ శ్రీ పి.మూర్తి యాదవ్ గారు వివరించారు. సుమారు 30 నిమిషాల పాటు రుషికొండ ప్యాలెస్ పరిసరాలను పరిశీలించిన అనంతరం అక్కడి నుంచి విమానాశ్రయానికి బయలుదేరారు.
Full project
Font
XML file
Song