నకిలీ పత్రాలతో అంధుడి భూమి కబ్జా
• డీఆర్పీ కొనసాగించాలని పీజీ వైద్య విద్యార్థుల వినతి
• ఇంటి పక్కనే బ్రాందీ షాపుతో అవిడి గ్రామస్తుల అవస్థలు
• సోమవారం జనవాణికి పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితులు
• సమస్యలు స్వయంగా విన్న నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు జనం అమాయకత్వం, అత్యాశే పెట్టుబడిగా ఆన్ లైన్ సంస్థలు కోట్లు కొల్లగొడుతున్నాయి. ఊరు పేరు తెలియని ఆన్లైన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టొద్దని ఒక వైపు విస్తృత ప్రచారం జరుగుతున్నా… అత్యాశకు పోతున్న జనం లక్షల్లో పెట్టుబడులు పెట్టి చివరకు మోసపోయి లబోదిబోమంటున్నారు. సోమవారం జనసేన గ్రీవెన్స్ లో గూగుల్ ఇండియా పేరుతో ఓ ఆన్ లైన్ సంస్థ తనను రూ.9 లక్షలకు ముంచేసిందని అనకాపల్లికి చెందిన శ్రీ గుడాల బాలాజీ బోరుమన్నాడు. స్నేహితులు, ఆన్ లైన్ యాప్స్ నుంచి అప్పులు చేసి డబ్బులు కట్టానని… ఇప్పుడా డబ్బులు తిరిగి రాకపోతే మరణమే శరణమని కన్నీరు పెట్టుకున్నాడు. ఎంతైనా పెట్టుబడి పెట్టండి. అందుకు తగిన ఆదాయాన్ని, క్రమం తప్పకుండా పొందొచ్చంటే నమ్మి స్నేహితుల నుంచి అప్పులు చేసి కట్టాను. తొలుత చిన్నమొత్తాలతో పెట్టుబడులు ప్రారంభించాను.. నిత్యం డబ్బులు జమయ్యే సరికి నమ్మకం పెరిగి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ యువకుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు… సమస్య పరిష్కరించాలని సైబర్ క్రైం అధికారులకు సూచించారు. సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించే జనవాణి కార్యక్రమంలో శ్రీ బొమ్మడి నాయకర్ గారు పాల్గొని అర్జీదారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. కొన్ని విజ్ఞప్తులపై అక్కడికక్కడే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.
•
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్.ఎమ్.సి.) ప్రవేశపెట్టిన డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం (డీఆర్పీ)ను కారణాలు చెప్పకుండా వైద్యశాఖ అధికారులు నిలిపివేశారని గుంటూరు జిల్లాలో చదువుతున్న పీజీ వైద్య విద్యార్థులు జనవాణిలో ఫిర్యాదు చేశారు. 2020లో ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రాం కింద మూడు నెలలపాటు జిల్లా దవాఖానాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉందని అయితే వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలతో ఈ ఏడాదిని డీఆర్పీ ప్రోగ్రాం నిలిచిపోయిందని వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశానుసారం డీఆర్పీ కొనసాగించాలని కోరారు. దీనిపై స్పందించిన శ్రీ బొమ్మిడి నాయకర్ గారు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిం
Photo project
Background link
Background Remove
XML file