28.11.2024
వైసీపీ పాలకుల నిర్వాకంతో ఆక్వా రైతులు మునిగిపోయారు
• ఆదుకునేలా పటిష్టమైన విధానం తీసుకురావాలి
• ఏపీ ఆక్వాకల్చర్ ఫెడరేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి
• జనసేన జనవాణిలో అర్జీలు స్వీకరించిన తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి
శ్రీనివాసులు గారు
‘రాష్ట్రానికి ఆర్ధిక జవసత్వాలు తీసుకొచ్చే ఆక్వా రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. విద్యుత్ రాయితీలను పక్కనపెట్టేశారు సీడ్, ఫీడ్ ధరలు పెరిగినా పట్టించుకోలేదు. ఆక్వా జోన్ల పేరుతో నిజమైన రైతుల పొట్టకొట్టారు. ఆక్వా రంగం విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించాల’ని ఏపీ ఆక్వా కల్చర్ ఫెడరేషన్ ప్రతినిధులు జనవాణిలో తమ వేదన వినిపించారు. ఆక్వా రంగాన్ని బతికించాలని, దీనికోసం పటిష్టమైన విధానాన్ని తీసుకురావాలని కోరారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో గురువారం తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు చెప్పిన వేదనలు విని, వెంటనే పరిష్కరించే సమస్యలపై ఫోన్ ద్వారా అధికారులకు తగిన సూచనలు చేశారు.
*
ఆక్వా పరిశ్రమ నష్టాల్లో ఉంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ టాక్స్ ను ఆకా ఫీడ్ మీద తగ్గించినా, దాని ఫలితం గాని, ధరల తగ్గుదల గాని కనిపించడం లేదు. గతంలో ఆక్వా రైతులకు ఇచ్చిన విద్యుత్ సబ్సీడీని గత ప్రభుత్వం రకరకాల కారణాలతో, ఆక్వా జోన్ల పేరుతో తొలగించింది. ప్రస్తుతం వస్తున్న సీడ్ కూడా నాణ్యంగా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చి పెట్టే ఆక్వా రైతుల కోసం ప్రభుత్వం పటిష్టమైన విధానాన్ని తీసుకురావాలని ఏపీ ఆక్వా కల్చర్ ఫెడరేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందించారు.
* భీమవరానికి చెందిన శ్రీ గుర్రం మాల కొండయ్య అనే వ్యక్తి రొయ్యలు ఎగుమతి చేస్తుంటారు. 2023లో నెల్లూరు కు చెందిన శరత్ ఇండస్ట్రీస్ సంస్థకు రూ.1.21 కోట్ల విలువైన రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇచ్చారు. అయితే శరత్ ఇండస్ట్రీస్ కు చెందిన సబ్బెళ్ళ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి సరకును తీసుకొని డబ్బులు ఇవ్వడం లేదని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Full 3D project
XML file
Song link
Font