చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై దాడి దురదృష్టకరం
•ఒక వ్యక్తిపై కాదు… ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలి
చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా- ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలి. కొన్ని దశాబ్దాలుగా శ్రీ రంగరాజన్ గారు ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు… పోరాటం చేస్తున్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళిన ఒక మూక శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలి. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను శ్రీ రంగరాజన్ గారు నాకు అందించారు. టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియచేశారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారు. ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలి. చిలుకూరు వెళ్ళి శ్రీ రంగరాజన్ గారిని పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేశాను.
@csranga
(పవన్ కళ్యాణ్)@PawanKalyan
ఉప ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్
అధ్యక్షులు, జనసేన
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టూరిజం కార్పోరేషన్ డైరెక్టర్ శ్రీమతి గంటా స్వరూప, రాష్ట్ర కార్యదర్శి శ్రీ చాగంటి మురళీ కృష్ణ, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీ చిట్టెం వెంకటేశ్వర్లు
Full project
XML
Song link