శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేసినవాళ్లను కఠినంగా శిక్షించాలి.
• దాడి చేసినవాళ్ళ వెనక ఎవరు ఉన్నారో నిగ్గు తేల్చాలి.
• టీటీడీ బోర్డు సభ్యుడు, జనసేన ఉపాధ్యక్షుడు శ్రీ మహేందర్ రెడ్డి, జనసేన
తెలంగాణ ఇంఛార్జి శ్రీ శంకర్ గౌడ్
• శ్రీ రంగరాజన్ గారిని పరామర్శించిన జనసేన నాయకులు
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై దాడిచేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని, దాడికి పాల్పడినవారి వెనక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని టీటీడీ బోర్డు సభ్యుడు, జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ బొంగునూరి మహేందర్ రెడ్డి, జనసేన తెలంగాణ ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తున్న శ్రీ రంగరాజన్ గారిపై దాడి చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. సోమవారం మధ్యాహ్నం చిలుకూరులో శ్రీ రంగరాజన్ గారిని జనసేన తెలంగాణ విభాగం నాయకులు కలిసి పరామర్శించారు. దాడి ఘటనపై వాకబు చేశారు. జనసేన అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ఇచ్చిన సందేశాన్ని శ్రీ రంగరాజన్ గారికి
తెలియచేశారు.
అనంతరం మీడియాతో శ్రీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ “చిలుకూరు బాలాజీ ఆలయం భక్తులకు ఎంతో పవిత్రమైనది. ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడికీ శ్రీ రంగరాజన్ గారు పరిచయమే. ఆయనపై చోటు చేసుకున్న దాడి దురదృష్టకరం. ఈ విషయం తెలిసి శ్రీ పవన్ కల్యాణ్ గారు ఎంతో ఆవేదనకు లోనయ్యారు. ఈ ఘటనను ఖండించారు. దాడి విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి” అన్నారు. శ్రీ శంకర్ గౌడ్ మాట్లాడుతూ “శ్రీ రంగరాజన్ గారిపై దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలి. ఆయనకు అండగా ఉంటామని దైర్యం చెప్పాము” అన్నారు.
చిలుకూరు వెళ్ళిన బృందంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ రాధారం రాజలింగం, పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ ఆర్.కె. సాగర్, వీరమహిళ తెలంగాణ విభాగం అధ్యక్షురాలు శ్రీమతి కావ్య మండపాక, పార్టీ నేతలు శ్రీ ఎడమా రాజేష్, శ్రీ నందగిరి సతీష్, శ్రీ మాధవ రెడ్డి, శ్రీ వేముల కార్తీక్ తదితరులు ఉన్నారు.
font link
Full project
XML
Song link