TRENDING REEL157 santhosh RCF creations Guruji reel157
మొదలైంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నిరోదించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం. మహిళల రక్షణ కోసం ఏర్పాటైన చట్టాలు కఠినంగా అమలుకావడం లేదు.
• మహిళాలోకం కూటమి వెంట నడిచేందుకు సిద్ధం: శ్రీమతి యామినీ శర్మ, బీజెపీ వైసీపీ డిక్షనరిలో అ అంటే అఘాయిత్యాలు, ఆరాచకాలు… ఆ అంటే ఆగని దాడులు, ఇ అంటే ఇంటింటికి భద్రత ఉందా అనేలా పరిస్థితులున్నాయి. వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇక్కట్లకు గురైయ్యాయి. పేదల రక్తాన్ని తాగేలా ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారిస్తుంది. నేనున్నాను ..నే విన్నాను అని చెప్పిన సిఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డికి పేదల సమస్యలు పట్టడం లేదు. ఇసుకను సామాన్యులకు అందనీయకుండా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. అసంఘటిత రంగాన్ని నమ్ముకున్న జీవిస్తున్న లక్షలాది మంది పేదలు రోడ్డున పడ్డారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చిన వైసీపీ ప్రభుత్వంలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతోంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారు. మహిళల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి, గవర్నర్ పదవులు మహిళలకు కేటాయించి వారికి సముచిత స్థానం కల్పించారు. రాజ్యాంగ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బిజెపి మహిళా నేతలు, కార్యకర్తలపైనా అనేక దాడులు జరుగుతున్నాయి. దేశంలో అభివృద్ధి పాలన జరుగుతుంటే రాష్ట్రంలో ఆరాచక పాలన రాజ్యమేలుతోంది. మహిళల ఆర్ధికాభివృద్ధికి జగన్ సర్కార్ చేసింది శూన్యం, రాష్ట్రంలో హోం మంత్రులుగా పని చేసిన ఇద్దరు మహిళలు రబ్బర్ స్టాంపులే. రాష్ట్రంలో ఆడ బిడ్డల అదృశ్యంపై శ్వేత పత్రం విడుదల చేయాలి. అంగన్వాడి, ఆశా వర్కర్లు, అమరావతి మహిళా రైతులపై మగ పోలీసులతో భౌతిక దాడులు చేయించిన ప్రభుత్వం ఇది. తమ శాఖల విధులు తెలియని మంత్రులు బూతు పురాణాల్లో నిష్ణాతులు, బూతులు మాట్లాడే కొందరు మంత్రుల్ని, ఎమ్మెల్యేలను సిఎం శ్రీ జగన్ వారిని సొమ్యులు అని సంభోదించడం సరికాదు. కేంద్రం వికసిత భారత్ గా ఉంటే ఏపీలో వినాష్ ఆంధ్ర పాలన నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కూటమిని స్వాగతిస్తున్నారు.
• మహిళలను మోసం చేయడంలో మాస్టర్ జగన్: శ్రీమతి ఆచంట సునీత, టీడీపీ
మహిళల్ని మోసం చేయడంలో జగన్ మాస్టర్స్ చేశారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు, ఆక్రమ కేసులు ఎక్కువయ్యాయి. ఒక్క చాన్స్ పేరుతో సిఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేజిక్కించు కున్నారు. అంగన్వాడీ, ఆశా, ద్వాకా మహిళల్ని ప్రభుత్వం మోసగించింది. కోటి మంది మహిళల్ని ఆసరా పేరుతో ఋణ మాఫీ చేస్తానని మోసగించారు. డ్వాక్రా సంఘాల్లోని సభ్యులను వైసీపీ మీటింగులకు తరలించేందుకే వినియోగిస్తున్నారు. సిద్ధం పేరుతో సిఎం శ్రీ జగన్ చేపట్టిన యాత్రలకు ప్రజాదరణ కరవైంది. డ్వాక్రా మహిళల్ని బెదిరించి మీటింగులకు తరలిస్తున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు.
FULL PROJECT
XML FILE
SONG LINK

















Post Comment