HAPPY BIRTHDAY REEL170 reel170

కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారు

• పిఠాపురం మేడే వేడుకల్లో శ్రీ నాగబాబు గారు

01.05.2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కార్మికులపై పూర్తి నిర్లక్ష్యం కనబరచినదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె నాగబాబు గారు స్పష్టం చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మేడే వేడుకల్లో శ్రీ నాగబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలైన అన్ని విభాగాల్లో కార్మిక చట్టాలను కించెత్తు కూడా అమలు చేయని ప్రభుత్వంగా వైసీపీ చరిత్రలో నిలిచి పోతుందని చెప్పారు. పొట్ట కూటికి కూడా గడవని దుర్భరమైన పరిస్థితులు, కుటుంబాలను పోషించుకోలేని దయనీయ స్థితిలో అనేకమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2019లో భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖపట్నంలో చేపట్టిన సభను మొదలుకొని ఈ ఐదేళ్లలో మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, కులవృత్తి ఆధారిత కుటుంబాల కోసం పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో చేనేత కార్మికులు పడుతున్న వెతలు వర్ణనాతీతమని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం శాసన సభ్యులుగా చేనేత కార్మికులకు వెన్ను దన్నుగా నిలబడతారని చెప్పారు. పిఠాపురం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ నేమూరి శంకర్ గౌడ్, శ్రీమతి చల్లా లక్ష్మీ, శ్రీ శశిధర్, శ్రీ రమణ, శ్రీ సురేష్, శ్రీ సతీష్, శ్రీ చిన్నబాబు, శ్రీ లాసర్ బాబు, శ్రీ రంగబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు

పి.రిత్రసాను

(పి.హరిప్రసాద్)

FULL PROJECT 

DOWNLOND

XML FILE 

DOWNLOND

VIDEO PHOTO LINK

DOWNLOND

DOWNLOND

SONG LINK

DOWNLOND

Leave a Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO