జనసేన
JANASENA
వన్నెపూడి ఉదంతంపై వివరాలు సేకరిస్తున్నాం
• తాటిపర్తి విషయంలో స్థానిక నాయకులు నిర్ణయం తీసుకుంటారు.
09.06.2024
•
జన సైనికులు సంయమనం పాటించాల్సిన సమయం ఇది
పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఇటీవల వన్నెపూడిలో జరిగిన ఉదంతం పార్టీ దృష్టికి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నాం. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటాం. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. తాటిపర్తి గ్రామంలో జరిగిన సంఘటన గురించి కూడా మాకు సమాచారం ఉన్నది. ఈ విషయంపై పిఠాపురం కో ఆర్డినేటర్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలోని స్థానిక నాయకులు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారు. జన సైనికులంతా సంయమనం పాటించాల్సిన సమయం ఇది. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో కీలక భూమిక పోషిస్తున్న తరుణంలో.. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో చక్కబెట్టాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కేంద్రంలో ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం, ఇంకో వారం రోజుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రానున్నారు. పిఠాపురం కో ఆర్డినేటర్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ పిఠాపురంలో అందరికీ అందుబాటులో ఉంటారు. పిఠాపురం ప్రజల సమస్యలు తీర్చడానికి అందుబాటులో ఉండే విధంగా పిఠాపురంలో జనసేన నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంసిద్ధులై ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందాం. సాధ్యమైనంత వరకు నేను కూదా పిఠాపురంలో అందుబాటులో ఉంటాను. జన సైనికులు నిరంతరం ప్రజా క్షేత్రంలోనే ఉంటారన్న సంగతి తెలిసిందే. సమస్యలు ఏవైనా ఉంటే అందరం కూర్చొని పరిష్కారం అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకుందాం. ముఖ్యంగా పిఠాపురంలో సాగు నీరు, తాగు నీరు కొరతను అధిగమించాల్సిన అవసరం ఉన్నది. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తాం. సుద్దగడ్డ రిజర్వాయర్ పనులపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చేసే అంశాలపై దృష్టి సారించాలని జన సైనికులకు, వీర మహిళలకు ముఖ్యంగా
Full Project JSP
Name Art All Use
TDP Name Art
YCP Name Art
XML file All material Link



