Viral Instagram reels trending video editing Rcf146

సమస్యలు తెలుసుకునేందుకు ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. సమస్యలు చెప్పుకొనేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులను స్వయంగా కలిసి వారి బాధలు విన్నారు. సోమవారం సాయంత్రం కేంద్ర కార్యాలయం ముందు వినతి పత్రాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. వైసీపీ నాయకుల కబ్జాలు, గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తమకు న్యాయం చేయాలంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రాలు సమర్పించారు. సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడుతానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ బాధితులు చెప్పిన కొన్ని సమస్యలు ఇవి…

ఇచ్చారు.

కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను తమను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐదుగురు స్టాఫ్ నర్సులను నియమించేలా చూడాలని కోరారు. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు బీమా కల్పించడంతో పాటు పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలి అని విజ్ఞప్తి

చేశారు.

వైసీపీ నాయకులు తన తండ్రికి చెందిన ఎకరన్నర భూమిని కబ్జా చేయడంతో పాటు సగానికి పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భావరాజుపాలెంకు చెందిన శ్రీమతి కృష్ణవేణి అనే మహిళ శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. తమ భూమి తమకు వచ్చేలా న్యాయం చేయాలని కోరారు. తమ కుమారుడిని తన స్నేహితులే హత్య చేసి రోడ్డు మీద పడేశారని అయితే పోలీసులు దానిని అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి క్లోజ్ చేశారని చోడవరానికి చెందిన శ్రీమతి సోమాదుల కృప అనే మహిళ తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరింది.

విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన పలువురు మహిళలు తమకు సొంత ఇల్లు లేదని, రేషన్ కార్డు లేదని, ఒంటరి మహిళ పెన్షన్ రావడం లేదని శ్రీ పవన్ కళ్యాణ్ గారి విన్న వించుకున్నారు.

Template Link

Download

XML file

Download

Song 

download

Leave a Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO