Raghavan sir Trending Video Editing in santhosh rcf Rcf216
విజయవాడ, పరిసరాల్లోని వరద బాధితులకు మేము సైతం అంటూ జనసేన ఎన్.ఆర్.ఐ. అమెరికా విభాగం అండగా
నిలిచింది. పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న నిత్యావసర సరుకుల వాహనాలను శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద శాసనమండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడతోపాటు వరదలకు దెబ్బ తిన్న పెద్దపులిపాకలో 1020 కుటుంబాలకు రూ.20 లక్షలు విలువ చేసే నిత్యావసరాలు కిట్లను అందించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ప్రతి కిట్ లో 8 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో ఉల్లిపాయలు, లీటర్ వంట నూనె, కిలో ఉప్పు, కారం, చింతపండు ఉన్నాయి. వీటిని వరదలో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు స్వయంగా జనసేన ఎన్నారై అమెరికా విభాగం సభ్యులు అందజేస్తారు. ఈ సభ్యుల సేవా కార్యక్రమాలను శ్రీ హరిప్రసాద్ గారు అభినందించారు. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిలోని సేవా తత్పరత ఇచ్చిన స్ఫూర్తితో పార్టీ నాయకులు శ్రేణులు ప్రజలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో అందిస్తున్న చేయూత ఎంతో విలువయినదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, చేనేత వికాస విభాగం చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన ఎన్ఆర అమెరికా విభాగం సభ్యులు శ్రీ అనిల్ అనుసూరు, శ్రీ స్వామి అనిశెట్టి, శ్రీ సాయి రాజా కొత్తమాసు, శ్రీ సాయి నండూరి, శ్రీ సప్తగిరి ఇందుగుల, పార్టీ నేతలు శ్రీ సందీప్ పంచకర్ల, శ్రీ చిక్కాల సుబ్రహ్మణ్యేశ్వర రావు, శ్రీ ఓదూరి కిషోర్, శ్రీ నక్కా తాతీలు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదరి, ఆద్వర్యంలో.
FONT LINK
Full Project
XML file
Video
Song link

















Post Comment