Photo background editing in Alight Motion Rcf315
20 నెలల్లో డిపాజిట్ చేసిన మొత్తానికి రెట్టింపు చెల్లిస్తారని నమ్మబలికి తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్ భార్య 9ఎఫ్ఎక్స్ గ్లోబల్ అనే సంస్థలో మాతో రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టించారని, ఇప్పుడు ఆ సంస్థ బోర్డు తిప్పేస్తే సదరు కానిస్టేబుల్, అతని భార్య కూడా చేతులెత్తేశారని శ్రీ పువ్వాడి వెంకట్రావు దంపతులు జనవాణిలో అర్జీ సమర్పించారు. తిరుపతి కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన సంస్థ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తాము కట్టిన మొత్తం తిరిగి ఇప్పించాలని కోరారు.
•
37 ఏళ్ల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం, కొమరగుంట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇచ్చిన పేదలు నివేశన స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని శ్రీ గోవిందరెడ్డి ఫిర్యాదు చేశారు. లబ్దిదారులు తీసుకోని స్థలాలను కొంత మంది అక్రమార్కులు ఆక్రమించుకుని దొంగ పత్రాలతో అమ్ముకుంటున్నారని, ఆ లే అవుట్ రీ సర్వే చేయించి ప్రభుత్వ భూమిలో నిజమైన లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. తమ గ్రామంలో మురుగు పారే కాలువని రొయ్యల చెరువులతో మూసివేశారని గణపవరం మండలం, వల్లూరుకు చెందిన శ్రీ కె. విజయదుర్గారావు జనసేనలో వాపోయారు. వీరితోపాటు గూడు లేని నిరుపేదలు నివేశన స్థలాల కోసం, పింఛన్ల కోసం పలువురు దివ్యాంగులు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్ధిక సాయం కోసం అనారోగ్య పీడితులు జనవాణిలో అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్, పార్టీ నాయకులు శ్రీమతి రావి సౌజన్య, న్యాయ విభాగానికి చెందిన శ్రీ చేజెర్ల వెంకటేశ్వరరావు, శ్రీ కోటేశ్వరరావు, శ్రీమతి హనుమకొండ వాసవి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
4 Photo Project Link
XML file
Font link

















Post Comment