Trending BGM Lyrical Video Rcf369 love
మహాయుతి నేతల హర్షాతిరేకాలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రచారం కీలకమైన అంశం. జనసేనాని ప్రచారం చేసిన, రోడ్ షో నిర్వహించిన అసెంబ్లీ స్థానాల్లో లాతూరు సిటీ స్థానం మినహా అన్నింటా మహాయుతి కూటమి అభ్యర్థి విజయం సాధించారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు మహారాష్ట్రలో రెండు రోజులపాటు ప్రచారం నిర్వహించారు. 11 అసెంబ్లీ స్థానాలు, ఉప ఎన్నిక జరిగిన నాందేడ్ పార్లమెంట్ స్థానంలోని అభ్యర్ధులకు మద్దతుగా వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రచారం చేశారు. 10 అసెంబ్లీ స్థానాలు, నాందేడ్ లోక్ సభ స్థానంలో మహాయుతి కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లోని కీలకమైన నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. నాందేడ్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సంతోక్ రావు మారుత్ రావు హంబర్డే విజయం దక్కించుకున్నారు. డేగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీ అంతపుకార్ జితేష్ రావ్ సాహెబ్, భోకర్ నుంచి శ్రీమతి జయశ్రీ అశోక్ రావ్ చవాన్, షోలాపూర్ సెంట్రల్ నుంచి శ్రీ దేవేంద్ర రాజేశ్ కోటె, షోలాపూర్ నార్త్ నుంచి శ్రీ దేశ్ ముఖ్ విజయ్ సిద్ధరామప్ప, షోలాపూర్ సౌత్ నుంచి శ్రీ దేశ్ ముఖ్ సుభాష్ సురేష్ చంద్ర, బల్లార్ పూర్ నుంచి శ్రీ ముంగటివార్ సుధీర్ సచ్చిదానంద్, చంద్రాపూర్ నుంచి శ్రీ జోగేశ్వర్ కిషోర్ గజానన్, పుణె కంటోన్మెంట్ నుంచి శ్రీ సునీల్ ధ్యాన్ దేవ్ కాంబ్లే, కస్బాపేట్ నుంచి శ్రీ హేమంత్ నారాయణ్ రసానే, హడప్సర్ నుంచి శ్రీ చేతన్ విఠల్ తుపే తరఫున రోడ్ షోలు, బహిరంగ సభల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. మహారాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, మరాఠా ప్రజల ఐక్యత కోసం సుస్థిరమైన మహాయుతి కూటమికి పట్టం కట్టాలని మరాఠా ప్రజలను నిండు మనసుతో కోరారు. బహిరంగ సభల్లోనూ దేశం ఆర్ధికంగా ముందుకు వెళ్లాలంటే మహారాష్ట్ర అభివృద్ధి ఎంత అవసరమో, దానికి సమర్ధమైన పాలన ఇంకెంత అవసరమో చెబుతూ ప్రజల్లో చైతన్యం నింపారు. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశాభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రజలకు అర్థం అయ్యేలా వివరించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్న ప్రతి సభకు మరాఠా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా
Full project
XML file
Song link
Font link

















Post Comment