100 + font download santhosh Rcf

-2-
అవసరమని ప్రజలు గుర్తించారు కాబట్టే- అఖండ మెజార్టీతో కూటమిని గెలిపించారని తెలిపారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు ఎప్పుడూ ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆలోచన చేస్తారన్నారు. రాష్ట్రాభివృద్ధి అనేది శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు, శ్రీ చంద్రబాబు నాయుడు గారి విజన్ తోనే సాధ్యమని ప్రకటించారు. ఆదివారం సాయంత్రం మంగళగిరిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు చెందిన వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపిన రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులు 22 కుటుంబాలకు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నిలువునా ముంచేసింది. నిన్నటి నీతి అయోగ్ నివేదికలో ఆంధ్రప్రదేశ్ పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయి అభివృద్ధిలో దేశంలోనే చివరి స్థానంలో నిలిచిందని తేల్చింది. గత పాలకులు అన్ని శాఖల్లోనూ అప్పులే మిగిల్చారు. పౌరసరఫరాల శాఖలో రూ.41,150 కోట్ల రుణాలు తీసుకున్నారు. వాళ్ళ అప్పుల దెబ్బకు బ్యాంకులు రైతుల కోసం రుణాలు కావాలన్నా ఇచ్చే పరిస్థితి లేదు. వైద్య సేవల కోసం టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

  • శ్రీ పవన్ కల్యాణ్ గారి దూరదృష్టితో…
    గత పాలకులు రాష్ట్రాన్ని అంత దుర్మార్గంగా పాలించారు. ఒక నాయకుడికి దూరదృష్టి, ప్రణాళిక లేకపోతే దేశం నష్టపోతుంది… ప్రజలు నష్టపోతారని రాజ్యాంగం చెబుతుంది. ఈ పరిస్థితుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడి నాయకత్వం నూటికి నూరు శాతం రాష్ట్రానికి అవసరం. ఆయన ఒక ప్రణాళికాబద్దంగా అన్ని వర్గాలను బలోపేతం చేస్తూ, సమస్యలు తెలుసుకుంటూ పార్టీని నిర్మించుకుంటూ వచ్చారు. ఈ రోజున కష్టకాలంలో కార్యకర్తలకు రూ. 5 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నామంటే అది శ్రీ పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి ఫలమే. ప్రతి కార్యకర్త కుటుంబానికి కష్టకాలంలో భరోసా ఇవ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
    ఈ మధ్య కొంత మంది సోషల్ మీడియాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పదవి గురించి మాట్లాడుతున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏనాడూ పదవుల గురించి మాట్లాడలేదు. మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడాలి. పార్టీ కోసం పని చేయాలి. అప్పుడు పదవులే మన దగ్గరకు వెతుక్కుంటూ వస్తాయని మాత్రమే చెప్పేవారు. కొంత మంది మూర్ఖులు సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. పదవి వస్తేనే పని చేస్తామని ఏనాడు చెప్పలేదు. ప్రజల తరపున జనసేన పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంది. కార్యకర్తలకు అండగా నిలుస్తూనే ఉంది. ఇప్పటి వరకు దురదృష్టకర పరిస్థితుల్లో 928 మంది క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు బీమా పథకం ద్వారా రూ.24 కోట్లు అందజేశాం. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమం చేయలేదు.
    ANDHRA PRADESH

fon link

DOWNLOND

Leave a Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO