Dragon movie trending video BGM BGM169 bgm169
కలసికట్టుగా పని చేద్దాం… ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం
•
- పిఠాపురం సభపైనే యావత్ దేశం చూపు
- నోరుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.
అలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో కూర్చొని లబోదిబోమంటున్నాడు. - జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీల సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్,
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
పిఠాపురం వేదికగా ఈ నెల14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికుడు, వీరమహిళ తీసుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో దిగ్విజయం సాధించిన అనంతరం జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉన్నదని, సభను జయప్రదం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. హోలీ పండగ నాడు నిర్వహిస్తోన్న ఈ సభను పండగ వాతావరణంలో జరుపుకొందామని చెప్పారు. సభ జరిగిన తీరు చూసిన ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు జనసేనే అన్నట్లు మనందరం కలిసి పని చేద్దామని అన్నారు. సభ నిర్వహణ కోసం వేసిన 14 కమిటీలు… సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని, ప్రతి కమిటీ మరో కమిటీతో సమన్వయం చేసుకుంటూ సభను జయప్రదం చేయాలని సూచించారు. ఆవిర్భావ సభ నిర్వహణ కోసం నియమించిన కమిటీలతో శనివారం కాకినాడలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి ఎన్నికైన ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పీఓసీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించినప్పుడు నుంచి ఎన్నో కష్టనష్టాలు, అటుపోటులను తట్టుకొని పార్టీని తన సొంత రెక్కల కష్టంతో ముందుకు నడిపారు. ఇన్నేళ్ల పార్టీ ప్రస్థానంలో ఎనాడూ కూడా రాజకీయ లబ్ధి కోసం ఆయన పని చేయలేదు. మానవత్వం, నిజాయతీతో కూడిన విలువైన ప్రయాణం మాత్రమే చేశారు.
దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని విధంగా వంద శాతం స్ట్రైక్ రేట్ తో ఈ రోజు మనం విజయం సాధించాం. పోటీ చేసిన 21 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నాం.
Full Project
Font link
photo video link
XML file

















Post Comment