Lyrics video editing Rcf creation guruji ReEL
వేయి మంది క్రియాశీలక సభ్యులతో మొదలైన పార్టీ ప్రస్థానం నేడు 6.47 లక్షల మంది క్రియాశీల సభ్యులతో కొనసాగుతోంది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న క్రియాశీలక సభ్యత్వ నమోదులో 9 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలనేది లక్ష్యం. దీనికి అనుగుణంగా పార్టీ నాయకులు, నియోజక వర్గ నేతలు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలి. జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యే సభ్యులను మరింత పెంచాల్సిన అవసరం ఉంది.
• ప్రతి గ్రామం… ప్రతి వార్డులో సభ్యత్వ నమోదు ఉండాలి.
గతంలో ప్రతి నియోజకవర్గం నుంచి 15 మంది పార్టీ వాలంటీర్లకు మాత్రమే సభ్యత్వ నమోదుకు సంబంధించిన లాగిన్ ఐడీ ఇచ్చేవాళ్లం. అయితే అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈ ఏడాది ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పార్టీ వాలంటీర్లకు లాగిన్ ఐడీ ఇవ్వాలని నిర్ణయించాం. సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లాలి. పార్టీ సభ్యత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులోనూ జరగాలి. పార్టీ సిద్ధాంతాలతో పాటు సగటు మనుషులను పార్టీకి దగ్గర చేయడానికి ఈ సభ్యత్వ నమోదు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి అనుకోని ఆపద వస్తే, వారి కుటుంబానికి బీమా సొమ్ములు స్వయంగా అందించి పార్టీ కార్యకర్తలకు మనమంతా అండగా నిలబడిన తీరు స్ఫూర్తిదాయకం. పార్టీ సభ్యత్వం కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారు ఉన్నారు. వారందరినీ పార్టీ గొడుగులోకి తీసుకురావల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామం, ప్రతి వార్డును సభ్యత్వ వాలంటీర్లు తిరిగి 10 రోజులపాటు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొవాలి. తెలంగాణలో సైతం మన పార్టీ అభిమానులు, కార్యకర్తలున్నారు. వారు కూడా సభ్యత్వ నమోదులో పాల్గొంటారు. క్షేత్రస్థాయి నాయకులు కూడా ఎప్పటికప్పుడు వాలంటీర్లను సమన్వయం చేసుకుంటూ.. చిన్నచిన్న సమస్యలు లేకుండా చూసుకోవాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు శక్తివంచన లేకుండా పనిచేయాలి.” అన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ పి.హరిప్రసాద్, పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి. రత్నం, పార్టీ ఐటీ విభాగ ఛైర్మన్ శ్రీ మిరియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
XML file
Song link
Full project
PHOTO
















Post Comment