ప్రజలు జనసేన పార్టీని సంపూర్ణంగా విశ్వసిస్తూ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా స్వచ్చందంగా ప్రజల మద్దతు అందుతోంది. ఇలాంటి తరుణంలో పార్టీకి వారిని మరింత దగ్గర చేయాల్సి ఉంది. పార్టీ అందిస్తున్న క్రియాశీల సభ్యత్వం వారికి అందించాల్సిన అవసరం ఉంది. పార్టీకి గతంలో ఉన్న 6.47 లక్షల మంది క్రియాశీల సభ్యులను రెన్యువల్ చేస్తూనే కొత్త వారిని పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గురువారం నుంచి ప్రారంభం అయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాతో సహా పార్టీ నాయకులంతా ఆయా కేంద్రాల్లో కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదును సమష్టిగా విజయవంతం చేయాల్సి ఉంది. కేవలం లాగిన్ ఐడీలు పొందిన వారిది మాత్రమే బాధ్యత అనుకోవద్దు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కొత్త సభ్యత్వాలు పెంచేందుకు తగిన విధంగా కష్టపడాలి.
పార్టీ నుంచి పూర్తి సహకారం
చాలా సింపుల్ గా ఆన్ లైన్ వేదికగా సభ్యత్వాన్ని సులభంగా నమోదు చేయవచ్చు. రెన్యువల్ చేసే వారికి కేవలం 5 సెకండ్లలోనే ప్రాసెస్ పూర్తవుతుంది. అలాగే కొత్త సభ్యత్వం అయితే దాదాపు 3 నుంచి 5 నిమిషాలపాటు తగిన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎక్కడా అవాంతరాలు లేకుండా పూర్తి స్థాయిలో సహాయం చేసేందుకు పార్టీ నుంచి ఐటీ టీం సిద్ధంగా ఉంటుంది. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే వారి దృష్టికి తీసుకురావొచ్చు. కనీవిని ఎరుగుని రీతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండగలా నిర్వహించాలి. పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఆయా జిల్లాల్లోని ఇతర ప్రాంతాలను పర్యవేక్షించాలి. ఎప్పటికప్పుడు తగిన సహాయాన్ని అందించాలి. ఎవరికి ఎవరు అన్నట్లుగా కాకుండా సమష్టిగా ఈ కార్యక్రమంలో పాల్గొందాం. అలాగే ఐటీ టీం అందించే శిక్షణ కార్యక్రమంలోనూ వాలంటీర్లు పాల్గొని వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
• ప్రణాళిక ప్రకారం కార్యచరణ రూపొందించుకోండి
పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలకు అనుగుణంగా ఈసారి ప్రతి నియోజకవర్గంలో 50 మందికి లాగిన్ ఇస్తున్నాం. వారంతా ప్రజల్లో తిరిగి, అందరితో మమేకమై సభ్యత్వాలను ఓ ఆహ్లాదకరమైన పోటీ రూపంలో పూర్తి చేయాలి. ముఖ్యంగా యువత పార్టీకు చాలా దగ్గరగా ఉంది. వారి సభ్యత్వాలను పెంచాలి. చాలామందికి సభ్యత్వం తీసుకుంటే జరిగే మేలు ఏమిటన్నది… ఏ పార్టీలో లేని విధంగా రూ.5 లక్షల బీమా గురించి తెలుసు. చాలా ప్రాంతాల్లో సభ్యత్వం గురించి ఆత్రుతగా ఎదురు చూస్తున్న వారు ఉన్నారంటే పార్టీ క్రియాశీల సభ్యత్వం ప్రజల్లోకి ఎలా వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. దీన్ని వచ్చే 10 రోజుల్లో ఓ మహాక్రతువులా భావించి వాలంటీర్లు
Full project
XML file
Song link


