3d photo pop out Alight Motion Rcf182
ఆ
రక్షా బంధన్ శుభాకాంక్షలు
సోదర సోదరి ప్రేమ అనుభవైక్యంతోనే అర్థమవుతుంది. అక్కచెల్లెమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుంది. విప్లవ కవి శ్రీ గద్దరన్న పాడినట్టు చెల్లెలు పాదం మీద పుట్టుమచ్చగానో.. అక్క నుదుటున తిలకంగానో అలంకృతమైనప్పుడే రుణం తీరుతుందేమో! అదే విధంగా అన్నదమ్ముల ఆప్యాయతకు ఎవరు వెలకట్టగలరు? వీరిని జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజించడం తప్ప! అటువంటి అనురాగానికి ప్రతీకైన రక్షా బంధన్ పండుగ శుభ తరుణాన సోదర సోదరీమణులందరికీ అనురాగపూర్వక శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ వేడుకను శ్రావణ పౌర్ణమినాడు ప్రేమైక మనస్సులతో భారతీయులతోపాటు దక్షిణ, తూర్పు ఆసియా దేశాలలో వైభవంగా జరుపుకొనే ఈ పండుగ జరుపుకోవడం సోదర సోదరీమణుల అనురాగానికి ప్రతీక. ఈ శ్రావణ పౌర్ణమి దేశవాసులందరికీ శుభాలు కలుగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రక్షా బంధన్ శుభాకాంక్షలు.
Photo project 1
Photo project 1
XML file

















Post Comment