జనసేన
JANASENA
05.01.2025
జనసేన పార్టీ ప్లీనరీ నిర్వహణకు స్థలాల పరిశీలన
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ కోసం శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేపట్టారు. మార్చి 12, 13, 14 తేదీలలో జరిగే ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రానున్న నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ, సౌకర్యాల కల్పనకు అనువుగా ఉండే విధంగా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశించారు. సభకు వచ్చే పార్టీ శ్రేణులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆదివారం పిఠాపురం నియోజకవర్గం పరిధిలో పలు స్థలాలను పరిశీలించారు. శ్రీ హరిప్రసాద్ గారితోపాటు కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, పిఠాపురం ఇంఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, పార్టీ నేతలు శ్రీ వై శ్రీనివాస్, మురాలశెట్టి సునీల్ కుమార్, శ్రీ చక్రవర్తి, డా.పిల్లా శ్రీధర్, శ్రీ తెలగంశెట్టి వెంకటేశ్వర రావు, శ్రీ రావాడ నాగు, శ్రీ తలాటం సత్య, శ్రీ సతీష్, శ్రీ శివశంకర్, శ్రీ తుమ్మలపల్లి చందు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పి.రిత్రసాము
(పి.హరిప్రసాద్)
జనసేన అధ్యక్షులకు రాజకీయకార్యదర్శి జనసేన కేంద్ర కార్యాలయం, మంగళగిరి.
ANDHRA PRADESH
D.NO. 11-1402, Sri Lakshmi Narasimha Colony, Mangalagiri, Andhra Pradesh – 522503, India
}} www.janasenaparty.org
TELANGANA
Plot No. 72, Prashasan Nagar,
Jubilee Hills, Hyderabad, Telangana –
Font link
Full project
XML file



